![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతన్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -121 లో.. మైఖేల్ మందు కలిపిన జ్యూస్ తాగి అందరూ ఊగుతూ మాట్లాడతారు. రుద్రాణి మాత్రం సుభాష్, ప్రకాష్ లను మీరు అన్నలు కాదు దున్నలు అంటూ మైకంలో ఉన్నట్లుగా మాట్లాడుతుంది. అలా తను మాట్లాడుతుంటే రాహుల్ వచ్చి.. మమ్మీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్.. మామయ్య మీరు అమ్మ మాటలు పట్టించుకోకండని రాహుల్ చెప్తాడు.
మరొకవైపు మైఖేల్ దగ్గరికి రాహుల్ వెళ్ళి.. ఏంటి ఇంకా అవకాశం కోసం చూస్తున్నావా త్వరగా స్వప్నని కిడ్నాప్ చేయమని అంటాడు. అవకాశం దొరికిన ప్రతిసారీ ఎవరో ఒకరు అడ్డుగా వస్తున్నారని మైఖేల్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ ని పెళ్ళి కోసం రెడీ చేస్తుంటాడు రాజ్. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని స్వప్నని పెళ్లి చేసుకుంటూన్నావ్ అని రాజ్ అనగా.. సారి రాజ్ నీ విషయంలో నేను తప్పు చేశానని నటిస్తాడు. నువ్వు కొంచెం మొండివాడివి అంతే, అది పక్కన పెడితే నీ అంత మంచివాడు ఉండడని రాజ్ అంటాడు. అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది.
అక్కడ అన్ని పనులు ఉంటే ఇక్కడ రాహుల్ తో కబుర్లు చెప్తున్నావా రాజ్, తాతయ్య పిలుస్తున్నాడు వెళ్ళు అని అంటుంది రుద్రాణి. రాజ్ వెళ్ళగానే.. ఏంటి స్వప్నని కిడ్నాప్ చేస్తారు అన్నావ్ ఏమైంది? అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని రుద్రాణి అంటుంది. ఈ పెళ్ళి జరగదు మమ్మీ.. నువ్వయితే ఆ వెన్నెలతో పెళ్లి సెట్ చెయ్.. వెన్నెల కోట్ల ఆస్తి నాకు గిఫ్ట్ గా ఇవ్వమని రాహుల్ అంటాడు. మరొకవైపు నాకు ఆకలిగా ఉందని స్వప్న అనగానే.. కావ్య టిఫిన్ తీసుకొని వచ్చి ఇస్తుంది.
ఆ తర్వాత రాహుల్ ని పీటల మీద కూర్చోపెడతారు. మరొకవైపు టిఫిన్ చేస్తున్న స్వప్న దగ్గరికి మైఖేల్ వెళ్లి కాసేపట్లో నిన్ను పెళ్లి చేసుకునేది నేనే అని అనగానే.. నువ్వేంట్రా నన్ను పెళ్లి చేసుకునేది.. ఈ విషయం మా వాళ్ళకి చెప్తా అని స్వప్న వెళ్తుంటే.. మైకేల్ తన మనుషులని పిలుస్తాడు. తొందరగా ఒక కర్చీఫ్ పై మత్తుమందు జల్లి స్వప్న ముక్కుపై పెడతారు. ఆ తర్వాత స్వప్నని అక్కడ నుండి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కాసేపటికి స్వప్నని తీసుకోని రావడానికి తన గదిలోకి వచ్చిన మీనాక్షి, కనకం, కావ్యలు.. స్వప్న గదిలో లేకపోవడంతో షాక్ అవుతారు. ఆ విషయం వెళ్లి అందరికి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రుద్రాణి, రాహుల్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సందు దొరికింది కదా అని రుద్రాణి కనకాన్ని తిడుతుంది. నీ పెంపకం ఇదీ అంటూ రెచ్చిపోతుంది రుద్రాణి. మా అక్క ఎక్కడ ఉన్నా తీసుకొస్తానని కావ్య వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |